అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్థాన్‌లో పర్యటించనున్నారంటూ ఆ దేశ మీడియా చేసిన తప్పుడు ప్రచారాన్ని వైట్‌హౌస్ ఖండించింది. ట్రంప్ పర్యటనకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ లేదని స్పష్టం చేసింది. దీంతో పాక్ మీడియా పరువు గంగపాలైంది. మరోవైపు ట్రంప్ స్కాట్లాండ్, యూకేలలో పర్యటిస్తారని, యూకే ప్రధానితో వాణిజ్య ఒప్పందాలపై చర్చిస్తారని వైట్‌హౌస్ తెలిపింది. పాకిస్థాన్ తమ హోదాను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుండగా, 2006 తర్వాత ఏ అమెరికా అధ్యక్షుడూ పాక్లో పర్యటించలేదు.

పాకిస్థాన్ మళ్లీ ఫేక్ డప్పు.. గట్టిగా మొట్టికాయలేసిన అమెరికా.. మరోసారి పరువు పాయే
Posted on: 19-07-2025
Categories:
NRI