చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. ‘హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్‌కు సమయం దగ్గర పడిపోయింది. ఇంకో 9 రోజుల్లోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇంతకుముందు ప్రకటించిన జూన్ 12 నుంచి సినిమా వాయిదా పడడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం ఒక్కటే కారణం కాదు. సినిమా బిజినెస్ వ్యవహారాలు తేలకపోవడం కూడా కారణమే.ఐతే కొత్త డేట్ ప్రకటించాక వదిలిన ట్రైలర్ ఇటు ప్రేక్షకులను, అటు ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంది. బిజినెస్ పరంగా కొంచెం జోష్ తీసుకొచ్చింది.