ఏపీలో 'నోట్ల ఆస్పత్రి' పేరుతో ఒక వినూత్న వ్యాపారం జరుగుతోంది. ఇక్కడ ప్రజలు తమ వద్దనున్న చిరిగిన, కాలిన నోట్లను ఇచ్చి చెల్లుబాటు అయ్యే నోట్లను మార్చుకోవచ్చు. నోటు యొక్క పరిస్థితిని బట్టి దాని విలువను నిర్ణయించి, కొంత కమీషన్ తీసుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు. గుంటూరు జిన్నా టవర్ దగ్గర 1970 నుంచి ఈ షాపు ఉంది. గుంటూరుతో పాటు విజయవాడ, తెనాలి, రాజమహేంద్రవరంలో కూడా ఈ నోట్ల ఆస్పత్రులు ఉన్నాయి.