జగన్

జగన్ లాగే పోలీసులకు వెంకట్రామిరెడ్డి వార్నింగ్

Posted on: 10-07-2025

Categories: Politics | Andhra

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి గత ప్రభుత్వంలో వైసీపీకి అనధికారిక ఏజెంట్ లా పనిచేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే, వైసీపీ నేతల మాదిరిగా వెంకట్రామిరెడ్డి కూడా ఫ్రస్ట్రేషన్ లో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. పోలీసులను దుస్తులు విప్పదీసి నిలబెడతా అంటూ వైసీపీ అధినేత జగన్ అన్న మాటలను వెంకట్రామిరెడ్డి ఆదర్శంగా తీసుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడతారని డైరెక్ట్ గా పోలీసులకు ఆయన వార్నింగ్ ఇచ్చిన తీరు హాట్ టాపిక్ గా మారింది.

Sponsored