పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ తండ్రి రాజేష్ నర్వాల్ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన బిడ్డకు హాని జరిగితేనే ఆ బాధ ఏమిటో మునీర్‌కు తెలుస్తుందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే సంస్థలను నిర్మూలించాలని ఆయన డిమాండ్ చేశారు. కుమారుడిని కోల్పోయిన బాధను దిగమింగుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇక, దాడికి పాల్పడిన టీఆర్ఎఫ్2ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

‘అసిమ్ మునీర్‌కు ఆ బాధేంటో అప్పుడు తెలుస్తుంది’.. పహల్గామ్‌లో చనిపోయిన నేవీ అధికారి తండ్రి
Posted on: 19-07-2025
Categories:
Politics