జూలై 27వ తేదీ ఆదివారం నాడు సింగపూర్ లోని తెలుగు ప్రజలతో చంద్రబాబు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ కార్యక్రమం జరగనుంది.ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని తెలుగు ప్రజలంతా పాల్గొనాలని ఏపీఎన్నార్టీఎస్ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వేదిత, ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరు కాదలిచిన వారు క్రింద తెలిపిన లింక్ ద్వారా రిజిస్టర్ కావాలని, తద్వారా వచ్చే సభ్యులకు తగిన ఏర్పాట్లు చేయడానికి వెసులుబాటు ఉంటుందని రవి వేమూరు అన్నారు.