సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న 'SSMB 29' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి ఈ చిత్రాన్ని ఊహించని విధంగా తీర్చిదిద్దుతున్నారని పృథ్వీరాజ్ తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి, ఆగస్టులో తిరిగి ప్రారంభించనున్నారు.