సర్పంచ్

సర్పంచ్ ఎన్నికలపై కీలక అప్‌డేట్.. కీలక ఆదేశాలు జారీ..

Posted on: 19-07-2025

Categories: Politics | Andhra

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు పంచాయతీరాజ్ శాఖ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఎన్నికల సామగ్రిని తనిఖీ చేయాలని, నివేదికలు సమర్పించాలని డీపీవోలకు ఆదేశాలు జారీ అయ్యాయి. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రాగానే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈసారి రెండు విడతల్లోనే ఎన్నికలు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఎన్నికలు గ్రామ స్వరాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించనున్నాయి.

Sponsored