కాజల్

కాజల్ ఉండగా.. సాయిపల్లవిపై మోజు పడడమా?

Posted on: 07-07-2025

Categories: Movies

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ‘రామాయణం’ను చెప్పొచ్చు. నితీశ్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026, 2027 సంవత్సరాల్లో రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఇటీవలే రిలీజ్ చేసిన షో రీల్ వావ్ అనిపించేలా ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్, ఇతర విశేషాల గురించి రెండు రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఐతే నెటిజన్లు అంతటితో ఆగిపోవట్లేదు. ఎవ్వరూ ఊహించని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మీమ్స్‌తో, జోక్స్‌తో రెచ్చిపోతున్నారు. ఆ చర్చ సాయిపల్లవి, కాజల్ అగర్వాల్‌ల గురించి కావడం విశేషం.

Sponsored