పీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బుధవారం చాలా బిజీ బిజీగా గడిపారు. క్షణం తీరిక లేకుండా.. ఏపీ వ్యవహారాలపై ఆయన కేంద్ర మంత్రులతో వరుస భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులు, ఆర్థిక సమస్యలను చర్చించారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటోందని ఆయన చెప్పారు. ఈ క్రమంలో మరింత సాయం చేయాలని కేంద్ర మంత్రులకు సూచించారు. తొలుత కేంద్ర ఆర్థిక ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతికి ఇచ్చిన 1500 కోట్ల రూపా యల గ్రాంటుపై కృతజ్ఞతలు తెలిపారు.