ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నల్లమల అడవి పరిసర గ్రామీణ ప్రాంతంలో పులుల సంచారం వణుకు పుట్టిస్తుంది. గత రెండు సంవత్సరాలుగా పులులు, చిరుతలు అభయ అరణ్యాన్ని వదిలి జనావాసంలోకి రావడం ఎక్కువ అవుతుండటంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఎక్కువగా ఉన్నటువంటి నల్లమల అడవిని వదలి గ్రామాల్లో సంచరిస్తూ ఆవులు, మేకల మందలపై దాడి చేస్తున్నాయి. గత ఏడాది నల్లమల అడవి ప్రాంతంలోకి కట్టెల కోసమని వెళ్లిన ఒక మహిళను చిరుతపులి దాడిలో చనిపోయింది.