విశాఖలో

విశాఖలో TCSకు రూ.99 పైసలకే 21.16 ఎకరాలు.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Posted on: 31-07-2025

Categories: Politics | Andhra

విశాఖపట్నంలో టీసీఎస్‌కు భూముల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంలో తప్పులేదని, కంపెనీల రాకతో రాష్ట్రానికి కలిగే లాభాలను పరిశీలించాలని సూచించింది. టీసీఎస్ రూ.1370 కోట్ల పెట్టుబడితో 12 వేల ఉద్యోగాలు ఇస్తామని చెబుతోందని కోర్టు పేర్కొంది. తక్కువ ధరకే భూమిని కేటాయించినా, సంస్థ రాకతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేటాయింపులు తుది తీర్పుకు లోబడి ఉంటాయని తెలిపింది.

Sponsored