ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రతిపక్ష వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. చెత్తను ఊడ్చినట్టు.. నేరస్తులను కూడా ఊడ్చేస్తానని హెచ్చరించారు. ``ఇంట్లో చెత్త ఉంటే ఏం చేస్తాం. ఊడ్చి అవతల పడేస్తాం. డస్ట్ బిన్నుల్లో కుక్కుతాం. అలా నే.. రాష్ట్రంలో రాజకీయ నేరస్తులుగా చెలామణి అవుతున్న చెత్త కూడా పోగుపడింది. దానిని కూడా ఊడ్చేస్తా. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదు. ప్రజలే వారిని పక్కన పెట్టారు. ఇప్పుడు మేం ఉపేక్షిస్తే.. అది తప్పవుతుంది. ప్రజలు ఇచ్చిన తీర్పునకు అర్ధమే ఉండదు