'హరిహర వీరమల్లు’ సినిమా తొలి వీకెండ్‌ని పూర్తి చేసుకుంది. కానీ అసలు పరీక్ష మాత్రం సోమవారం నుంచి మొదలవుతోంది. ఆ రోజు నుంచి కలెక్షన్లు ఎలా వస్తాయన్నదే సినిమా విజయానికి కీలకంగా మారబోతోంది. విడుదల సందర్భంగా పెంచిన టిక్కెట్ ధరలు సోమవారం నుంచి తగ్గనున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ చిత్రానికి తాత్కాలికంగా టికెట్ రేట్లు పెంచే అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే భారీ టిక్కెట్ ధరల వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

‘వీరమల్లు’కు షాకింగ్ కలెక్షన్లు.. నేటి నుంచి టిక్కెట్ల రేట్లు తగ్గింపు
Posted on: 28-07-2025
Categories:
Movies