స్థాయి చిన్నదే కావొచ్చు. కొందరు చేసే పనులు అందరిని ప్రభావితం చేయటమే కాదు.. కొత్త గొంతకు ప్రతీకగా నిలుస్తుంటారు. మిగిలిన రాజకీయ పార్టీలను పక్కన పెడితే.. తెలుగుదేశం క్యాడర్ కు కొత్త స్ఫూర్తిగా నిలిచిన ఒక చిన్న కార్యకర్త రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారు మాట్లాడుకునేలా చేశారు. అతనే.. తెలుగుదేశం పార్టీకి అత్యంత విధేయుడు.. పార్టీ కోసం దేనికైనా.. ఎంతకైనా వెళ్లే కార్యకర్తగా సుపరిచితుడు 50 ఏళ్ల నంబూరు శేషగిరిరావు.