తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి తక్కువ డబ్బులు జమ చేశారని వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. తొమ్మిది, పది తరగతులు, ఇంటర్ చదివే ఎస్సీ విద్యార్థులకు కేంద్రం వాటా కింద రావాల్సిన సొమ్ము 20 రోజుల్లో వారి ఖాతాల్లో జమ అవుతుందని తెలిపింది. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను అకౌంట్‌లలో జమ చేసిందని స్పష్టం చేసింది.