2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంలో ఎన్నారైలు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తమ సొంత ఖర్చులు పెట్టుకొని మరీ ఎన్నారైలు టీడీపీ, జనసేన, బీజేపీలకు ఓటేసేందుకు పోటెత్తారు. ఈ క్రమంలోనే ఎన్నారైల కోసం అమరావతిలో ఐకాన్ టవర్ ను నిర్మిస్తోంది ఏపీ ప్రభుత్వం. అమరావతి నిర్మాణంలో, పీ4 కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఎన్నారైలకు ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ప్రవాసాంధ్రులకు ఏపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై, ఎన్నారైల సాధికారిత మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఏపీఎన్నార్టీఎస్ ద్వారా ఎన్ఆర్ఐల సంక్షేమం, భద్రత, అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆయన అన్నారు.