ఐపీఎల్

ఐపీఎల్ 2026కి ముందు కేకేఆర్ కీలక నిర్ణయం.. టైటిల్ అందించిన కోచ్‌తో కటీఫ్‌

Posted on: 30-07-2025

Categories: Sports

ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలవడంతో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు హెడ్‌ కోచ్ చంద్రకాంత్ పండిట్.. తన పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన హెడ్‌ కోచ్ పోస్టుకు రాజీనామా చేసినట్లు కేకేఆర్ జట్టు ప్రకటించింది. కొత్త అవకాశాలను వెతుక్కునేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని కేకేఆర్ యాజమాన్యం తెలిపింది. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.

Sponsored