తిరుమల

తిరుమల శ్రీవారికి విరాళంగా రూ.3 కోట్ల విలువైన వీలునామా!

Posted on: 24-07-2025

Categories: Politics

హైదరాబాద్‌కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి వైవీఎస్ఎస్ భాస్కర్‌రావు తన వీలునామా ద్వారా తిరుమల శ్రీవారికి రూ.3 కోట్ల విలువైన ఇల్లు, రూ.36 లక్షల విరాళం అందజేశారు. ఆయన మరణానంతరం ట్రస్ట్ సభ్యులు వాటిని టీటీడీ ఈఓకి అందజేశారు. వనస్థలిపురంలోని ఆనంద నిలయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించాలని, బ్యాంకులోని నగదును వివిధ ట్రస్టులకు విరాళంగా ఇవ్వాలని ఆయన కోరారు. ట్రస్టీలు ఆ వీలునామాను టీటీడీకి అందజేయగా, ట్రినిటీ సంస్థ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.2 కోట్ల విరాళం ప్రకటించింది.

Sponsored