నీకు

నీకు కొమ్ములు ఉన్నాయా? సూపర్ స్టార్ కల్చర్ మానుకుంటే బెటర్.. టీమిండియా ప్లేయర్‌పై సునీల్ గవాస్కర్ కామెంట్..

Posted on: 17-07-2025

Categories: Sports

ఏ మాత్రం అంచనాలు లేకుండా ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన భారత యువ జట్టు, అంచనాలకు మించి రాణిస్తోంది. శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో యువ జట్టు, ఇప్పటిదాకా ఆడిన మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్‌కి గట్టి పోటీ ఇచ్చింది. 15 రోజుల్లో 13 రోజుల పాటు భారత జట్టు ఆధిపత్యమే కనిపించింది. అయితే మొదటి టెస్టు ఐదో రోజు, మూడో టెస్టు ఐదో రోజు ఆధిపత్యం చూపించిన ఇంగ్లాండ్, సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది.

Sponsored