అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదంలో 241 మంది మరణించిన విషయం తెలిసిందే. దర్యాప్తులో ఇంధన స్విచ్‌లు ఆఫ్ కావడం కారణమని నిపుణుల కమిటీ వెల్లడించింది. దీంతో ఇతర విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఎతిహాద్ ఎయిర్‌వేస్ పైలట్లకు అలర్ట్ జారీ చేసింది. బోయింగ్ 787 విమానాల్లోని ఇంధన స్విచ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విమానాల్లో ఇంధన స్విచ్‌ల పనితీరును పరిశీలిస్తున్నట్లు సంస్థ తెలిపింది.