ఎప్పుడు ఎలా మొదలయ్యాయో తెలియదు కానీ కల్వకుంట్ల ఫ్యామిలీలో కలహాలు స్టార్ట్ అవ్వడం, కవిత రాసిన ఆరు పేజీల లేఖతో అవి బయటపడడం తెలిసిందే. తన లేఖలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పరోక్షంగా విమర్శిస్తూ కవిత వ్యాఖ్యలు చేయడం పార్టీలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లేఖతో కవిత, కేటీఆర్‌లకు చెడిందన్న విషయం స్పష్టమైంది. వీరి మధ్య వైరం రోజురోజుకు ముదురుతుంది. వీరి గొడవలను తండ్రి కేసీఆర్ పరిష్కరిస్తారని అంతా అనుకున్న కూడా ఆయనేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.