ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది నేడు ఐటీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు విజన్ కారణమంటే అతిశయోక్తి కాదు. విజన్ 2020 అంటూ ఐటీ రంగం సాధించబోయే వృద్ధిని 20 ఏళ్ల క్రితమే అంచనా వేసిన దార్శనీకుడు ఆయన. అదే మాదిరిగా ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి కూడా ఆ పటంలో చోటు కల్పించేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఆ క్రమంలోనే అమరావతిలో "అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్(ఏక్యూసీసీ)’’ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.