తెలంగాణలో కాంగ్రెస్ నేత అనుమానస్పదమృతి సంచలనంగా మారింది. మెదక్ జిల్లాకు చెందిన అనీల్ కుమార్ కొల్చారం మండలం పైతరకు చెందిన అనీల్ సోమవారం రాత్రి ఇంటికి వెళ్తుండగా కారు అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లింది. అక్కడున్న వారు అనీల్‌ని మెదక్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అనీల్ మృతి చెందాడు. కాంగ్రెస్ నేత కుడి భుజానికి రెండు బుల్లెట్లు తగిలినట్లుగా పోలీసులు తేల్చారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగలేదని ..హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.