ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సారధ్యంలో జరిగిన ఈ భేటీ గంటన్నర పాటు జరిగింది. భేటీ ప్రారంభంలో సీఆర్ పాటిల్‌తో పాటు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు పరస్పరం గౌరవంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఈ భేటీలో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు తెలంగాణ ప్రతిపాదించిన 13 అంశాలపై ఈ భేటీలో చర్చించారు. కృష్ణా, గోదావరి జలాలు, బనకచర్లపై సాంకేతిక నిపుణులు, అధికారులతో కమిటీ ఏర్పాటుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.