సింగపూర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈనెల 24న సింగపూర్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు సింగపూర్‌లో జరగనున్న తెలుగు డయాస్పోరా మీట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ ఈవెంట్ ను 2025 జూలై 27న ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ డిజిటల్ క్యాంపస్ (పుంగ్గోల్) వద్ద అట్టహాసంగా నిర్వహించబోతున్నారు.