లోక్‌సభలో రాజస్థాన్ ఎంపీ హనుమాన్ బెనివాల్ చేసిన ప్రసంగం నవ్వులు పూయించింది. పాకిస్థాన్‌ను భారత దేశానికి భార్యగా అభివర్ణిస్తూ.. భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌కు సిందూరం పెట్టిందని ఆయన చమత్కరించారు. త్వరలోనే పాక్‌ను భారత్‌కు తీసుకు రావాలని కోరారు. పెళ్లయిన వెంటనే వధువును అత్తారింటికి తీసుకు రావడం మన సంప్రదాయం అని దాని ప్రకారమే దాయాది దేశాన్ని భారత్‌కు తీసుకు రావాలని అన్నారు. అలాగే పహల్గాం దాడికి దారితీసిన భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పాకిస్థాన్ ఇండియాకు భార్యగా మారింది, వెళ్లి అత్తారింటికి తీసుకురండి..: పార్లమెంటులో రాజస్థాన్ ఎంపీ
Posted on: 30-07-2025
Categories:
Politics