ఏపీలో

ఏపీలో ముస్లింలకు కేంద్రం శుభవార్త.. ఇకపై హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరంలేదు

Posted on: 31-07-2025

Categories: Politics | Andhra

ఆంధ్రప్రదేశ్ నుండి మక్కాకు వెళ్లే ముస్లింలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హజ్ యాత్ర ఎంబార్కేషన్ పాయింట్‌గా గుర్తించింది. దీని ద్వారా యాత్రికులకు ప్రయాణ ఖర్చు, సమయం ఆదా అవుతాయని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రం నుంచే హజ్ యాత్ర ప్రారంభించవచ్చు.

Sponsored