గిరిజన, ఆదివాసీ రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకాన్ని రాష్ట్రంలోని అన్ని తండాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీని ద్వారా వచ్చే మూడేళ్లలో 2.10 లక్షల మంది ఎస్టీ రైతులకు, 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ పంపుసెట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే, ఉచిత విద్యుత్ పథకాలను పర్యవేక్షించడానికి కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.