ఏపీ రాజకీయాలలో రప్పా రప్పా రాజేసిన వేడి అంతా ఇంతా కాదు. ఆ డైలాగ్ వాడడాన్ని ఖండించాల్సిన వైసీపీ అధినేత జగన్ అదో సినిమా డైలాగ్ తప్పేంటి అంటూ సమర్థించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే, రప్పా రప్పా అని పగలు అరవడం కాదని..చీకట్లో కన్నుకొడితే సైలెంట్ గా అయిపోవాలి అని మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు ఆ డైలాగ్ కన్న ఎక్కువగా వైరల్ అయ్యాయి. వైసీపీ నేతలు, కార్యకర్తలను పేర్ని నాని రెచ్చగొడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.