ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ రీజియన్ అభివృద్ధి కోసం భూసమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలలో 1941 ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలోని పద్మనాభం, ఆనందాపురం మండలాలు, విజయనగరంలోని డెంకాడ, భోగాపురం మండలాలు, అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం, అనకాపల్లి మండలాలలో భూమిని సమీకరించనున్నారు.