తమిళరాజకీయాల్లో

తమిళరాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ న్యూస్.....ఈనెల 25న కమల్‌హాసన్ ప్రమాణ స్వీకారం

Posted on: 17-07-2025

Categories: Politics

మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపాలని పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించిందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్ గతంలోనే వెల్లడించారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసి ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్‌హాసన్ త్వరలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పుకొచ్చారు. జూలై 25న రాజ్యసభ సభ్యులుగా ఆ బాధ్యతలు స్వీకరిస్తారని మక్కల్ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్ పేర్కొన్నారు.గత లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పార్టీ... డీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే.

Sponsored