ఉద్యోగులూ

ఉద్యోగులూ మీ పాత ITRలు ఓసారి చెక్ చేసుకోండి.. ఆ క్లెయిమ్స్ చేస్తే కఠిన చర్యలు!

Posted on: 17-07-2025

Categories: Politics

దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ విస్తృత తనిఖీలు చేపడుతోంది. మల్టీనేషనల్ కంపెనీలు (MNC), ప్రభుత్వ రంగ సంస్థలు (PSU), ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులుఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద తప్పుడు డిడక్షన్లు క్లెయిమ్ చేసి పన్ను వాపసు పొందుతున్నారని గుర్తించింది. దీనిపై దృష్టి సారించిన ఆదాయపు పన్ను శాఖ విస్తృత తనిఖీలు చేస్తోంది. చాలా మంది ఉద్యోగులు సమర్పించిన క్లెయిమ్‌లలో వాస్తవం లేదని, ఎక్కువ మొత్తంలో క్లెయిమ్ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Sponsored