ఫస్ట్

ఫస్ట్ హెచ్చరించాకే...: ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు...

Posted on: 15-07-2025

Categories: Politics | Andhra

ఆంధ్రప్రదేశ్‌లోని వాహనదారులకు బిగ్ అలర్ట్... ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై ముందస్తుగా హెచ్చరికలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. వివరాలు... సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రోజున రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌పై సమీక్ష చేపట్టారు. వాట్సప్‌ గవర్నెన్స్‌, డేటాలేక్‌, డేటా అనుసంధానం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ట్రాఫిక్ ఉల్లంఘనలపై స్పందిస్తూ... రాష్ట్రంలోని అన్ని కూడళ్లలో, ప్రధాన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు

Sponsored