ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు రిలేషన్ లో ఉన్నారని గత కొద్దిరోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసింది. `ది ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్ సమయంలో సమంత, రాజ్ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా ఆపై ప్రేమగా మారిందని.. త్వరలోనే రాజ్, సమంత ఏడడుగులు వేయడం ఖాయమని కథనాలు వెలువడుతున్నాయి. ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తూ రాజ్ తో కలిసి పదేపదే సామ్ దర్శనమిస్తోంది. ఎక్కడికెళ్లిన రాజ్ ను వెంట పెట్టుకుపోతోంది.