మహిళలకు

మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం..

Posted on: 21-07-2025

Categories: Politics | Andhra

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు చక్కటి కబురు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఆర్టీసీ ద్వారా మహిళలకు పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. ఈ ప్రయాణానికి ప్రత్యేకంగా ‘జీరో ఫేర్ టికెట్’ జారీ చేస్తారు. ప్రయాణించేటప్పుడు మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో, ప్రభుత్వ రాయితీ వల్ల ఎంత డబ్బు ఆదా అయిందో టికెట్‌పై స్పష్టంగా ముద్రించాలి అని సీఎం ఆదేశించారు.

Sponsored