తెలంగాణ ప్రభుత్వం మైక్రోబ్రూవరీల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఈ బ్రూవరీలు ఇకపై అన్ని మునిసిపల్ కార్పొరేషన్లకు విస్తరించనున్నాయి. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం వంటి నగరాల్లోనూ మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు అనుమతులు లభించనున్నాయి. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనివల్ల క్రాఫ్ట్‌బీర్ ప్రియులకు కొత్త రుచులు అందుబాటులోకి రావడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా.