ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు, ఇళ్ల స్థలాలు, ఇళ్లకు సంబంధించి లోతుగా దృష్టి పెడుతోంది. ఆగస్టు 1 నుంచి ప్రజలకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించింది. "సర్వే పూర్తయిన భూ యజమానులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్ని ఆగస్టు నాటికి ఇవ్వండి" అని సీఎం చంద్రబాబు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తొలివిడతగా 21.86 లక్షల మందికి ముద్రణ పూర్తి చేసి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని తెలిపారు. అందువల్ల ప్రజలు ఈ కొత్త పాస్ పుస్తకాలు తీసుకునేందుకు రెడీ అవ్వాలి.