కక్షపూరిత రాజకీయాలతో అక్రమ అరెస్టులు చేసినంత మాత్రాన తాత్కాలికంగా ఆనందం పొందొచ్చేమో గానీ వైసీపీ పోరాటాలను అడ్డుకోలేరు అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన వైసీపీ భయపడిపోతుందని అనుకోవడం కన్నా అవివేకం ఉండదు అని చెప్పుకొచ్చారు. అధికారం చేతిలో ఉంది కదా అని వైఎస్ జగన్ పర్యటనలకు రాకుండా హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటారు. అంతకుమించి ప్రజా సమస్యలపై ఆయన గళం విప్పకుండా ఆపలేరని గుర్తుంచుకోవాలి.