ఆయన తొలిసారి విజయం దక్కించుకున్నారు. కానీ.. అటు రాజకీయాలకు, ఇటు ప్రజలకు కూడా ఆయన కొత్తకాదు. గత 10-15 సంవత్సరాలుగా ప్రజలతోనే ఉన్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూనే ఉన్నారు. వారితో మమేకమై నడుస్తూనే ఉన్నా రు. ఆయనే వేగేశ్న నరేంద్రవర్మ. గత రెండు ఎన్నికల్లోనూ వర్మ.. బాపట్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, ఆయనకు పెద్దగా అవకాశాలు చిక్కలేదు. గత ఎన్నికల్లో మాత్రం టికెట్టు-విజయం రెండూ చేరువయ్యాయి. ఇక, అప్పటికే ఆయన ప్రజానాయకుడిగా సేవకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు.