ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఒక నకిలీ ఎంబసీ రాకెట్‌ను ఇటీవలే బయట పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అతడు ఘజియాబాద్‌లో ఎనిమిదేళ్లుగా నకిలీ రాయబార కార్యాలయం నడుపుతూ ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్నాడు. ఇతను దాదాపు 300 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. విదేశీ పర్యటనలు, బ్యాంక్ ఖాతాల ద్వారా మనీలాండరింగ్ కూడా జరిపినట్లు తేలింది.

162 విదేశీ ట్రిప్‌లు, 25 షెల్ కంపెనీలు, రూ.300 కోట్ల స్కామ్..: నకిలీ దౌత్యవేత్త కేసులో షాకింగ్ విషయాలు
Posted on: 28-07-2025
Categories:
Politics