ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. గోదావరికి వరద పోటెత్తే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండొచ్చు. ఏం జరగనుందో వేచి చూడాల్సిందే!