తిరుమల

తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుడి ఖరీదైన కానుక.. 2.5 కేజీల బంగారంతో శంఖం, చక్రం.. ఎన్ని కోట్లంటే!

Posted on: 29-07-2025

Categories: Politics

చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధులు తిరుమల శ్రీవారికి రూ.2.4 కోట్ల విలువైన బంగారు శంఖం, చక్రాన్ని కానుకగా సమర్పించారు. 2.5 కిలోల బరువున్న ఈ ఆభరణాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. మరోవైపు, టీటీడీ ఈవో జె. శ్యామల రావు శ్రీనివాస కల్యాణోత్సవాలను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విదేశాల్లో కల్యాణోత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని సూచించారు.

Sponsored