దర్జాగా

దర్జాగా గన్స్‌తో ఆసుపత్రిలోకి వచ్చి గ్యాంగ్‌స్టర్‌ హత్య... షాకింగ్ వీడియో

Posted on: 17-07-2025

Categories: Politics

బిహార్ రాజధాని పట్నాలోని పారస్ ఆసుపత్రిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. గురువారం నడిరోడ్డుపై గ్యాంగ్‌స్టర్‌ చందన్ మిశ్రా దారుణ హత్యకు గురయ్యాడు. ఐదుగురు దుండగులు ఆసుపత్రిలోకి చొరబడి కాల్పులు జరిపి హతమార్చారు. పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న చందన్ మిశ్రా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన బిహార్‌లో శాంతిభద్రతలపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది. ప్రతిపక్షాలు నితీష్ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

Sponsored