వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. 76 ఏళ్ల ముసలోడివి.. ఇంకెంతకాలం బ్రతుకుతావో తెలియదు.. నువ్వు 50 ఏళ్ల జగన్‌ను భూస్థాపితం చేస్తావా? అంటూ పరుష పదజాలాన్ని ఉపయోగించి పేర్ని నాని విమర్శలు చేశారు. పైగా కూటమి నేతలను అరేయ్ ఒరేయ్ అంటూ రెచ్చిపోయారు. అయితే తాజాగా హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ పేర్ని నాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

10 సంతకాలు చేస్తే చేతులు వణికే పేర్ని నాని.. గాలి తీసేసిన హోంమంత్రి!
Posted on: 15-07-2025
Categories:
Politics