తెలుగు అభిమానులపై మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ చేసిన ఎమోషనల్ స్పీచ్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ‘కింగ్డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలుగులో మాట్లాడిన అనిరుధ్... “మీ ప్రేమను తట్టుకోలేకపోతున్నా. మీరు నన్ను మీ అబ్బాయిగా దత్తత తీసుకున్నారు. నేను ఎప్పటికీ మీ అనిరుధ్‌నే... బక్కోడినే" అంటూ భావోద్వేగంగా చెప్పారు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి, నాగవంశీతో కలిసి పనిచేయడం మైలురాయిగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అనిరుధ్ స్పీచ్ తెగ వైరల్ అవుతోంది.

‘ఎప్పటికీ మీ బక్కోడినే’.. ఆ ఒక్క మాటతో గుండెల్ని పిండేశావ్ కదా బక్కోడా
Posted on: 30-07-2025
Categories:
Movies