మార‌తారా..

మార‌తారా.. త‌ప్పుకుంటారా.. మంత్రుల‌కు బాబు వార్నింగ్!

Posted on: 12-07-2025

Categories: Politics | Andhra

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన మంత్రుల పనితీరు ఆశించిన మేర ఉండకపోవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాస్తవానికి వైసీపీలో ఎవరు మాట్లాడాలి.. ఏం మాట్లాడాలి అనేది స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. కానీ టీడీపీలో రాజకీయ నాయకులకు స్వాతంత్రం ఉంది. అయినా కూడా చాలా మంది సైలెంట్‌గానే ఉంటున్నారు. ముఖ్యంగా మంత్రుల్లో కొద్దిమంది మాత్రమే యాక్టివ్ గా కనిపిస్తున్నారు. మిగ‌తా వారు త‌మ‌కెందుకులే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విధుల నిర్వహణలో ఎలా ఉన్నా.. విప‌క్ష వైసీపీ రాజకీయంగా చేసే ఆరోపణలు తిప్పుకొట్టడంలో మంత్రులు వెనక ప‌డ్డారు. ఈ విషయంపై తాజాగా క్యాబినెట్ భేటీలో బాబు రియాక్ట్ అవుతూ మంత్రుల‌కు నేరుగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Sponsored