డీమార్ట్,

డీమార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగాలు.. నిరుద్యోగులకు అదిరే శుభవార్త!

Posted on: 15-07-2025

Categories: Politics

నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు అనేక చోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలు సైతం పలుచోట్ల జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నాయి. అనేకమంది నిరుద్యోగ అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలను పొందుతున్నారు. వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం శుభవార్త అందించింది.జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థుల కోసం ఈ నెల 16న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి రజిత ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో డీమార్ట్, ఫ్లిప్‌కార్ట్ వంటి తదితర సంస్థలు కూడా పాల్గొనబోతున్నాయి

Sponsored