ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ రోలర్ రఘు వివాదంలో చిక్కుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో జరిగిన నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరుకావడం దుమారం రేపింది. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో కలిసి ఆయన వేదికపై కనిపించడంతో పలువురు విమర్శలు చేస్తున్నారు. రఘు అధికారిక కార్యక్రమానికి ఎలా హాజరయ్యారనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. గతంలో రఘు టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.