ఆగస్టు మొదటి వారంలో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. రేపటి నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేశారు. దీంతోపాటు, ఆగస్టు 5 తర్వాత మరో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. నేడు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు.